డివిజన్ల పునర్విభజన అశాసీ్త్రయం
గ్రేటర్ పరిధిలో వార్డు ల పునర్విభజన ప్రక్రియ అశాసీ్త్రయంగా నిర్వహించారు. ఏ పద్ధతిలో చేశారనేందుకు సారూప్యత ఎక్కడా కనిపించడం లేదు. ఓటర్ల సంఖ్య తీసుకుని చేస్తే కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అమీన్‌పూర్‌లో ఒక్కో వార్డులో 50 వేల ఓటర్లు ఉన్నారు. అమీన్‌పూర్ జనాభా, ఓటర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పటాన్‌చెరులో జేపీ కాలనీ పేరుతో వార్డు విభజన చేయడం విడ్డూరంగా ఉంది.
–కాసాల సుధాకర్,
దిశ కమిటీ సభ్యుడు
అమీన్‌పూర్‌లో మరిన్ని
డివిజన్లు కావాలి
అమీన్‌పూర్ పట్టణంలో లక్షా పది వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. పటాన్‌చెరును రెండు డివిజన్‌లుగా చేసినప్పుడు అమీన్‌పూర్‌ను అదే పద్ధతిలో ఐదు డివిజన్‌లుగా చేసే అవకాశం ఉంది. 25 వేల ఓటర్లకు ఓ డివిజన్‌గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏ మాత్రం అవగాహన లేకుండా గ్రేటర్‌ను 300 ముక్కలు చేశారు. ఓ పద్ధతి లేకుండా డివిజన్లు తయారయ్యాయి. ఏ లెక్కన అమీన్‌పూర్‌ను రెండు డివిజన్లుగా చేశారు?
–బాశెట్టి కృష్ణ, తాజా మాజీ కౌన్సిలర్
డివిజన్ల పునర్విభజన అశాసీ్త్రయం


