పటిష్ట బందోబస్తు ఏర్పాటు
హవేళిఘణాపూర్(మెదక్): పోలింగ్‌స్టేషన్ల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అదనపు ఎస్పీ మహేందర్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్‌స్టేషన్ల వద్ద ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. ఎవరైనా ఓట్ల కోసం ప్రలోభాలకు గురి చేస్తే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించాలన్నారు. పోలింగ్‌స్టేషన్ల వద్ద గుంపులుగా ఉండరాదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొదన్నారు.మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్, మెదక్‌రూరల్ సీఐ జార్జ్, ఆర్‌ఐ రామకృష్ణ, ఎస్‌ఐ నరేశ్‌లు ఉన్నారు.


