అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

Dec 11 2025 9:56 AM | Updated on Dec 11 2025 9:56 AM

అక్రమ

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

నర్సాపూర్‌: అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు పట్టుకుని కేసు నమోదు చేశారు. బుధవారం ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. నర్సాపూర్‌– వెల్దుర్తి మార్గం లింగాపూర్‌ గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేశారు. నర్సాపూర్‌ వైపు నుంచి వచ్చిన ప్యాసింజర్‌ ఆటోను తనిఖీ చేయగా, అందులో ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం బాటిళ్లు తీసుకువస్తూ ఆటోడ్రైవర్‌ ఆంజనేయులు పట్టుపడ్డారు. 384 క్వార్టర్ల మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎఫ్‌ఎస్‌టీ బృందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.

దూల్మిట్ట మండలంలో

మద్దూరు(హుస్నాబాద్‌): దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ షేక్‌ మహబుబ్‌ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓ అభ్యర్థి అదే గ్రామానికి చెందిన ఓ రైతు పత్తి చేనులో సుమారు రూ.95వేల విలువ చేసే పది కాటన్ల ఇంపీరియల్‌ బ్లూ మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సదరు అభ్యర్థి, మరో ఇద్దరితో పాటు ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మిన దూల్మిట్ట షాపు ఓనర్‌పై కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి బైక్‌, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం బాటిళ్ల స్వాధీనం

రామాయంపేట(మెదక్‌): నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం సీఐ నరేందర్‌ వివరాలు వెల్లడించారు. రామాయంపేటలోని అమృత బార్‌ నుంచి 90 లీటర్ల మద్యం బాటిళ్లు తీసుకొని కారులో చల్మెడ తరలిస్తుండగా దౌల్తాబాద్‌ ఎక్స్‌రోడ్డు వద్ద సీవిల్‌ ఎస్‌ఐ బాల్‌రాజ్‌ కలిసి ఎకై ్సజ్‌ పోలీసులు మద్యం, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

రెస్టారెంట్లు, దుకాణాలకు జరిమాన

హుస్నాబాద్‌: మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బాల ఎల్లం ఆధ్వర్యంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హోటళ్లపై బుధవారం దాడులు నిర్వహించారు. పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లు, సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌, ఫుట్‌పాత్‌లను అక్రమించిన దుకాణాలకు జరిమాన విధించారు. జగదాంబ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు రూ.వెయ్యి, రోహన్‌ బార్‌కు రూ.వెయ్యి, బాలాజీ హోటల్‌కు రూ.500, జిలేబి షాపునకు రూ.500, సాగర్‌ పాన్‌షాపునకు రూ.200, రెడ్డి ఎలక్ట్రికల్స్‌కు రూ.500, లక్ష్మికాంత్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు రూ.500, రేణుకా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు రూ.3వేల జరిమాన విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పర్యావరణ అధికారి రవి కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ యువకుని మృతి

నంగునూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ వివేక్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట మండలం కిష్టసాగర్‌కు చెందిన నర్ర భరత్‌రెడ్డి (22) మంగళవారం నంగునూరు వచ్చి రాత్రి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బైక్‌ అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయా లయ్యాయి. చికిత్స నిమిత్తం సిద్దిపేట లోని ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

విద్యార్థి ఆత్మహత్య

రామాయంపేట(మెదక్‌): మండలంలోని దామరచెరువు గ్రామానికి చెందిన విద్యార్థి పిట్ల సాయితేజ(20), ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన సాయితేజ చేను వద్ద గుడిసెలో ఉరేసుకున్నాడు. సమీపంలోని రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సాయితేజ ఐటీఐ చదువుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత 1
1/2

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత 2
2/2

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement