కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
పటాన్‌చెరు టౌన్: ఆగి ఉన్న కంటైనర్‌ను కిర్బీ పరిశ్రమ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలవ్వగా.. మిగిలిన వారికి స్వల్ప గాయాలై సంఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కర్ధనూర్ వద్ద చోటు చేసుకుంది. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం కిర్బీ పరిశ్రమకు చెందిన బస్సు కార్మికులను విధులకు తీసుకెళ్తుండగా కర్ధనూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలవ్వగా.. దాదాపు 23 మంది కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది వరకు ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిలో వెంకటరమణ, రామకష్ణ, జగదీష్, రాందాస్, రవి తీవ్రంగా గాయపడ్డారు. వీరినీ పటాన్ చెరులోని అమేధా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే..
రోడ్డు ప్రమాదంలో గాయపడిన కిర్బీ పరిశ్రమ కార్మికులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. బుధవారం మొదటి షిఫ్ట్‌కి వెళ్తున్న కిర్బీ పరిశ్రమ కార్మికుల బస్సు ప్రమాదానికి గురైంది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే ఆస్పత్రికి వెళ్లి కార్మికులను పరామర్శించారు. వైద్యులతో చర్చించి కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు అంతి రెడ్డి, శివ రెడ్డి, బండి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురు కార్మికులకు తీవ్రగాయాలు
కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు


