అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

Dec 10 2025 9:36 AM | Updated on Dec 10 2025 9:36 AM

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

జహీరాబాద్‌ టౌన్‌: అగ్నిప్రమాదంలో రేకుల ఇల్లు దగ్ధమై ఆస్తి నష్టం జరిగింది. ఈ సంఘటన మండలంలోని అల్గోల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి లక్ష్మమ్మ కూతురుతో కలిసి రేకుల ఇంట్లో ఉంటుంది. గ్రామంలోనే కూలీ పనులకు వెళ్తుంది. మంగళవారం కూడా పనులకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తాళం వేసిన ఇంటి నుంచి మంటలు వచ్చాయి. చుట్టు పక్కల వారు చూసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను ఆర్పడానికి కూడా ప్రయత్నించారు. ఫైర్‌ సిబ్బంది వచ్చే లోపు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో రూ.లక్ష, మూడు తులాల బంగారం, వంట సామగ్రి, దుస్తులు కాలి బూడిదయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement