చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడిని రిమాండ్‌కు తరలింపు
కొమురవెల్లి(సిద్దిపేట): మండల కేంద్రంలో గత 29న జరిగిన చైన్ స్నాచింగ్ చోరీ కేసును కొమురవెల్లి పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఎస్‌ఐ మహేశ్ వివరాలు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరిపి వివరాలు సేకరించినట్లు తెలిపారు. నమ్మకమైన సమాచారం ఆధారంగా మండల కేంద్రానికి చెందిన తీగుళ్ల రజనీకాంత్‌ను అదుపులోకి తీసుకొన్నామని చెప్పారు. అతడిని విచారించగా నేరం ఒప్పుకొన్నాడని, దీంతో రిమాండ్‌కు తరలించామని తెలిపారు.


