నాడు పతులు.. నేడు సతులు | - | Sakshi
Sakshi News home page

నాడు పతులు.. నేడు సతులు

Dec 10 2025 9:36 AM | Updated on Dec 10 2025 9:36 AM

నాడు

నాడు పతులు.. నేడు సతులు

బరిలోకి విద్యావంతురాలు

బరిలోకి విద్యావంతురాలు

కంగ్టి(నారాయణఖేడ్‌): మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామపంచాయతీకి సర్పంచ్‌ బరిలో ఆసక్తికర పోటీ నెలకొంది. 2019లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ముదిరాజ్‌ కృష్ణ , సంతపురం లక్ష్మణ్‌ బరిలోకి దిగగా... 26 ఓట్ల మెజారిటీతో లక్ష్మణ్‌ గెలుపొందారు. కాగా ప్రస్తుతం బీసీ మహిళకు సీట్‌ రిజర్వ్‌ కావడంతో వారి భార్యలు ముదిరాజ్‌ శ్వేత(బీఆర్‌ఎస్‌ మద్దతుదారు), సంతపురం జ్యోతిక (కాంగ్రెస్‌ మద్దతుదారుగా) బరిలో నిలిచారు. దీంతో ఇద్దరు సభ్యులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వరిస్తుందోనంటూ స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఒకే వార్డు బరిలో అన్నదమ్ములు

కంగ్టి(నారాయణఖేడ్‌): మండలంలోని తడ్కల్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే వార్డుకు సొంత అన్నదమ్ములు బరిలో నిలిచారు. గ్రామంలో ద్విముఖ పోటీ ఉండగా కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో 4వ వార్డుకు మారుతీరావు, స్వతంత్ర అభ్యర్థిగా మాధవరావు సొంత అన్నదమ్ములు పోటీలో నిలిచారు. కాగా ఎవరికి ఓటు వేయాలో తెలియక ఓటర్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. వార్డులో తమ సంబంధీకుల ఓట్లే ఉండటంతో గెలుపుపై ఇద్దరు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.

జహీరాబాద్‌ టౌన్‌: తెలంగాణ–కర్నాటక రాష్ట్ర సరిహద్దులో గల ధనసిరి గ్రామపంచాయతీ సర్పంచి బరిలో ఉన్నత విద్యావంతురాలు అంబ్రాపాలి నిలిచారు. మొగుడంపల్లి మండలం ధనసిరికి చెందిన దింగర్‌ను ఆమె వివాహమాడారు. అంబ్రాపాలి ఎంఏ(హిస్టరీ) పూర్తి చేశారు. పంచా యతీ ఎన్నికల్లో భాగంగా ధనసిరి గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో గ్రామస్తుల సహకారంతో సర్పంచి బరిలో నిలిచింది. విద్యావంతురాలు అయిన తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

బాండ్‌ పేపర్‌ రాసిస్తున్నా..

ఇవిగో మా హామీలు

వర్గల్‌(గజ్వేల్‌): ‘‘బాండ్‌ పేపర్‌ రాసిస్తున్నా.. ఇవి మా హామీలు.. మా సేవ.. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు చూపితే అదే రోజు రాజీనామా చేస్తా..’’ అంటూ వర్గల్‌ మండలం నాచారం సర్పంచ్‌ అభ్యర్థి ల్యాతోల్ల వసంత ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రూ.100 విలువైన బాండ్‌ పేపర్‌ మీద వాటర్‌ప్లాంట్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం తదితరాల ఏర్పాటుకు కృషి చేస్తామంటూ వివిధ హామీలు రాశారు. అదేవిధంగా ఏ రోజైనా అవినీతికి పాల్పడితే ఆధారాలు చూపిన వెంటనే అదేరోజు రాజీనామా చేస్తానంటూ రాసి ఉన్న బాండ్‌పేపర్‌ వాట్సాప్‌ గ్రూపులలో చెక్కర్లు కొడుతోంది.

సర్పంచ్‌గా గెలిపిస్తే ..

బెజ్జంకి(సిద్దిపేట): తనను సర్పంచ్‌గా గెలిపిస్తే కరీంనగర్‌ జిల్లాకు మద్దతుగా తీర్మానం ఇస్తానని బెజ్జంకి సర్పంచ్‌ అభ్యర్థి సంగ రవి మంగళవారం బాండ్‌ పేపర్‌పై ఒప్పంద పత్రం రాసి పోరాట సమితి నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా పోరాటసమితి నాయకులు మానాల రవి, డీవీ రావులు మాట్లాడుతూ మండల ప్రజల మనోభావాలను గుర్తించి కరీంనగర్‌లో కలిపేందుకు హామీ ఇచ్చి న నేతలు విస్మరించారని ఆరోపించారు. సర్పంచ్‌లలో కరీంనగర్‌ జిల్లా కోసం మద్దతు ఇచ్చే వారిని గెలుపించుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బెజ్జంకి సర్పంచ్‌ అభ్యర్థి సంగ రవి తదితరులు పాల్గొన్నారు.

మారిన ప్రచార సరళి

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): ఎన్నికలు వచ్చాయంటే ఒకప్పుడు ఏ గ్రామంలో చూసినా మైకు చప్పుళ్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపించేవి. కానీ సోషల్‌ మీడియా రాకతో ప్రచారం తీరే మారిపోయింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల ద్వారా ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఓటరు లిస్టు ఆధారంగా ఆయా వార్డుల్లో ఉండే ఓటర్ల ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్న అభ్యర్థులు వారికి నేరుగా ఫోన్‌ చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో తమకు కేటాయించిన గుర్తుకు ఓటు వేయాలని వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే తాము చేసే అభివృద్ధి పనులను వీడియో రూపంలో తయారు చేసి ఓటర్లకు పంపుతున్నారు. వీటికి ఎవరి అనుమతులు అవసరం లేకపోవడంతో ప్రచారం ముమ్మరంగా చేస్తు న్నారు. అభ్యర్థులు తయారు చేసిన వీడియో ఓటర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

నాడు పతులు.. నేడు సతులు1
1/5

నాడు పతులు.. నేడు సతులు

నాడు పతులు.. నేడు సతులు2
2/5

నాడు పతులు.. నేడు సతులు

నాడు పతులు.. నేడు సతులు3
3/5

నాడు పతులు.. నేడు సతులు

నాడు పతులు.. నేడు సతులు4
4/5

నాడు పతులు.. నేడు సతులు

నాడు పతులు.. నేడు సతులు5
5/5

నాడు పతులు.. నేడు సతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement