తనిఖీల్లో రూ.లక్ష స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

తనిఖీల్లో రూ.లక్ష స్వాధీనం

Dec 10 2025 9:36 AM | Updated on Dec 10 2025 9:36 AM

తనిఖీ

తనిఖీల్లో రూ.లక్ష స్వాధీనం

తనిఖీల్లో రూ.లక్ష స్వాధీనం డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మునిపల్లి(అందోల్‌): స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో రూ.లక్షను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఉప తహసీల్దార్‌ ప్రదీప్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని బుదేరా చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా పెద్దలోడి గ్రామానికి చెందిన దస్సయ్య రూ.లక్ష తీసుకొస్తుండగా వారు పట్టుకున్నారు.

అక్రమ మద్యం పట్టివేత

రేగోడ్‌(మెదక్‌): మండలంలోని మర్పల్లి గ్రామం వద్ద మంగళవారం బైక్‌పై తీసుకెళ్తున్న మద్యా న్ని పట్టుకున్నట్లు స్థానిక ఆర్‌ఐ విజయలక్ష్మి తెలిపారు. 58 క్వార్టర్‌ బాటిళ్లు, 15 బీరు బాటి ళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ శంకర్‌, సిబ్బంది ఉన్నారు.

ములుగులో...

ములుగు(గజ్వేల్‌): స్థానిక సంస్థల ఎన్నికల వేళ అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ములుగు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద చోటుచేసుకుంది. గజ్వేల్‌ రూరల్‌ సీఐ మహేందర్‌రెడ్డి, ములుగు ఎస్‌ఐ రఘుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓటర్లకు మద్యం పంచేందుకు గానూ ములుగు శివారులో గల శ్యాంసుందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద నిల్వ ఉంచారని అందిన సమాచారం మేరకు సీఐ, ఎస్‌ఐలు సిబ్బందితో కలసి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ.7,40,520 విలువ చేసే 673 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

గజ్వేల్‌రూరల్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇద్దరు వ్యక్తులకు రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మురళి తెలిపారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన వాహన తనిఖీల్లో ఎనిమిది మంది వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా గుర్తించామన్నారు. వారిని మంగళవారం గజ్వేల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ స్వాతిగౌడ్‌ ముందు హాజరు పర్చగా విచారణ అనంతరం ఆరుగురికి రూ. 33వేలు జరిమానా, మరో ఇద్దరికి రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. అంతకుముందు పట్టణంలోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌లో విద్యార్థులకు ట్రాఫిక్‌, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు.

సదాశివపేట(సంగారెడ్డి): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా... 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆరూర్‌ గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఎల్‌అండ్‌టీ పెట్రోలింగ్‌ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శవాన్ని 108లో సదాశివపేట ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటాయని, మృతుని శరీరంపై రామ గ్రీన్‌ కలర్‌ టీషర్టు, డబ్బాలు గల బుడిదరంగు గల షాట్‌ ధరించి ఉన్నాడని తెలిపారు.

తనిఖీల్లో రూ.లక్ష స్వాధీనం 
1
1/2

తనిఖీల్లో రూ.లక్ష స్వాధీనం

తనిఖీల్లో రూ.లక్ష స్వాధీనం 
2
2/2

తనిఖీల్లో రూ.లక్ష స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement