పోలింగ్‌ ఏజెంట్లే కీలకం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ ఏజెంట్లే కీలకం

Dec 10 2025 9:36 AM | Updated on Dec 10 2025 9:36 AM

పోలిం

పోలింగ్‌ ఏజెంట్లే కీలకం

కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం..

గ్రామ ఓటర్లనే నియమించుకోవాలి

వార్డుల్లో వార్డు ఓటరే ఉండాలి

దొంగ ఓట్లను గుర్తించేది స్థానికులే

వెల్దుర్తి(తూప్రాన్‌): ఎన్నికల రోజు పోలింగ్‌ ఏజెంటే కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్‌, వార్డుకు పోటీ చేస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి ఒక ఏజెంట్‌ను నియమించుకోవాలి. సదరు ఓటర్లను గుర్తించేది ఏజెంట్స్‌ కావడంతో సర్పంచ్‌గా పోటీ చేసే ప్రతీ అభ్యర్థి, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి కీలకమైన వ్యక్తిని ఏజెంట్‌గా నియమించుకుంటేనే వారి గెలుపు సాధ్యమవుతుంది. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే వ్యక్తులు ఏ వార్డు నుంచైనా వార్డు మెంబర్‌ అయితే ఏ వార్డు నుంచి పోటీ చేస్తున్నారో అదే వార్డుకు సంబంధించిన ఓటరును పోలింగ్‌ ఏజెంట్‌గా నియమించుకోవాలనే నిబంధన ఉంది. ఏదైనా కారణాల వల్ల ఇతరులను నియమించుకోవాల్సి వస్తే ముందే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి రాతపూర్వకంగా తెలిజేయాలి. దానిని పరిశీలించి అనుమతి ఇస్తే తప్ప ఇతరులను నియమించుకునేందుకు వీలులేదు.

ఓటర్లను గుర్తించేది ఏజెంట్లే..

ప్రతివార్డులో ఆ వార్డుకు సంబంధించిన ఓటరు వచ్చినప్పుడు ఎన్నికల సిబ్బంది ముందుగా క్రమసంఖ్యతో పాటు అతని పేరు, అంగీకరించినప్పుడే ఓటరుకు వేలుపై ఇంక్‌ పెట్టి బ్యాలెట్‌ పేపర్‌ అందజేస్తారు. ఓటరుకు బ్యాలెట్‌ పేపర్‌ అందిన తర్వాత ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎన్నికల అధికారి దానిని పరిగణలోకి తీసుకోరు. ఎవరైనా ఏజెంట్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రిసీడింగ్‌ అధికారి సమక్షంలో నిగ్గు తేల్చిన తర్వాతే ఆ ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.

ఏజెంట్ల వివరాలు రిటర్నింగ్‌

అధికారికి పంపాలి..

సర్పంచ్‌ అభ్యర్థి, వార్డు సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి స్క్రూట్నీ పూర్తి కాగానే ఏజెంట్‌గా నియమించుకునే వ్యక్తి అంగీకార పత్రాన్ని రాత పూర్వకంగా డూప్లికేట్‌ కాపీతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి పంపించాలి. పరిశీలన అనంతరం రిటర్నింగ్‌ అధికారి నియామక పత్రంపై ఆమోదం తెలుపుతూ సంతకం చేసి ఒక కాపీని ఏజెంట్‌కు అందజేస్తారు.

ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో మొదట వార్డుల వారీగా కౌంటింగ్‌ ఏజెంట్లను తీసుకొని కౌంటింగ్‌ నిర్వహిస్తారు. కౌంటింగ్‌ ఏజెంట్‌గా వచ్చేవారు ప్రభుత్వ ఉద్యోగి, పలు రాజకీయ పదవులు చేసిన వారు అనర్హులు. వీరిని తప్ప ఎవరినైనా ఏజెంట్లుగా నియమించుకోవచ్చు.

పోలింగ్‌ ఏజెంట్లే కీలకం1
1/1

పోలింగ్‌ ఏజెంట్లే కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement