కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ
మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్
సిద్దిపేటకమాన్: కేసీఆర్ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9 ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ అన్నారు. మంగళవారం దీక్షా విజయ్ దివస్‌లో భాగంగా పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేశారన్నారు. యావత్తు తెలంగాణ ప్రజలను ఒక్కటిగా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చేలా చేశారని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, సాయిరాం, సుందర్, శ్రీనివాస్, ఈర్షద్, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


