కనీస సదుపాయాలు కల్పించండి
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల విధులలో పాల్గొంటున్న ఉ పాధ్యాయ, ఉద్యోగులందరికీ కనీస వసతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావులు కోరారు. మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారిని విజయకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల విధులలో పాల్గొంటున్న పోలింగ్ ఆఫీసర్లకు వారి గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులను ప్రతి మండలంలో పెట్టాలని, చలి తీవ్రత దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా కనీస వస తులు కల్పించాలని కోరారు. పోలింగ్ సిబ్బందికి ఒకే విధమైన రెమ్యూనరేషన్ ఉండేల మండల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. మూడు దశల పోలింగ్‌లో పాల్గొనే వారికి వేర్వేరుగా ఓడీ సౌకర్యం కల్పించాలన్నారు. గర్భిణీలకు, ఫీడింగ్ మదర్స్‌కు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అవసరమున్న చోట మినహాయింపు ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు డ్యూటీ మార్చుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు.
డీఈఓకు యూటీఎఫ్ వినతి


