నా భర్తను విడిపించండి
● చేయని తప్పుకు మలేషియాలో జైలు శిక్ష
● సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన అబ్దుల్ ఖాదర్ కుటుంబం
దుబ్బాక: మలేషియా జైలులో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న నా భర్తను విడిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అబ్దుల్ ఖాదర్ భార్య సలీమా బేగం, కుమారుడు సల్మాన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం దౌత్యసాయం కోసం సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌రెడ్డి సూచన మేరకు ఎన్నారై అడ్వయిజరీకమిటీ తెలంగాణ ప్రభుత్వం వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్ ఖాదర్ కుటుంబం హైదరాబాద్‌లో సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతి ప్రతం అందించారు. భూంపల్లి–అక్బర్‌పేట మండలం పోతారెడ్డిపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మలేషియా దేశం వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న కంపెనీలో చేయని నేరానికి బాధ్యుడిని చేస్తూ జైల్‌లో వేశారు. 11 నెలలుగా మలేషియా జైల్‌లో మగ్గుతున్నాడు.


