బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు ఓటెయ్యండి: సునీతారెడ్డి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు ఓటెయ్యండి: సునీతారెడ్డి

Dec 10 2025 9:35 AM | Updated on Dec 10 2025 9:35 AM

బీఆర్

బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు ఓటెయ్యండి: సునీతారెడ్డి

హత్నూర( సంగారెడ్డి): అవినీతి కాంగ్రెస్‌ పాలనకు బుద్ధి చెప్పాలంటే బీఆర్‌ఎస్‌ మద్దతు అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన హత్నూర, బ్రాహ్మణగూడ, నాగుల్దేవులపల్లి గ్రామాలలో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులైన సర్పంచ్‌ అభ్యర్థులకు ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఆమె వెంట అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం బోర్డు మాజీ చైర్మన్‌ దేవేందర్‌ రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

అంకిత భావంతో

చదివితేనే ఉన్నత ఫలితాలు

డీఈఓ వెంకటేశ్వర్లు

మునిపల్లి(అందోల్‌): ప్రతి విద్యార్థి అంకిత భావంతో చదివితేనే ఉన్నత ఫలితాలు సాధ్యమని డీఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం మండలంలోని పెద్దగోపులారం, మునిపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అత్యత్తమ గ్రేడ్లను విద్యార్థులు సొంతం చేసుకోవాలని సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్షయ పాత్ర భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు తుకారాం, భాస్కర్‌, ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయులు నాగేశ్వర్‌, ఉపాధ్యాయులు వీరన్న, కృష్ణవేణి, ప్రశాంత్‌ కుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడిలో

ప్రీ క్రిస్మస్‌ వేడుకలు

నారాయణఖేడ్‌: అంగన్‌వాడి కేంద్రాల పనితీరును జిల్లా శిశుసంక్షేమాధికారి లలితకుమారి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఖేడ్‌ ఐసీడీఎస్‌ పరిధిలోని తిమ్మాపూర్‌లో అంగన్‌వాడి పిల్లలతో కలిసి ప్రీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. కేంద్రాల్లో పోషకాహారం అందజేస్తున్న తీరుతో పాటు వివిధ సేవల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. నిబంధనలు, మెనూ ప్రకారం పిల్లలకు పోషకాహారం అందించాలని కోరారు. ఆట పాటలతో బోధన చేస్తూ విద్యార్థులు ఆసక్తితో నేర్చుకొంటారని సూచించారు. ఖేడ్‌లోని బాలసదనం సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఆమెతో పాటు సీడీపీఓ సుజాత, అంగన్‌వాడి కేంద్రాల పర్యవేక్షకులు జమున, ప్రమీల, బులడేవిడ్‌, మంజుల ఉన్నారు.

ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారం

ప్రారంభించాలి

జహీరాబాద్‌: జహీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రధాన పంట అయిన చెరకును రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నందున ఈ సీజన్‌కు గాను ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారంలో క్రషింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వై.నరోత్తం కోరారు. ట్రైడెంట్‌ కర్మాగారంపై ఎనిమిది మండలాలకు చెందిన రైతులు ఆధారపడి ఉన్నారన్నారు. సుమారు 26వేల ఎకరాల్లో 10వేల మంది రైతులు చెరకు పంటను పండిస్తున్నట్లు పేర్కొన్నారు. పండించిన చెరకును ఎక్కడకు తరలించాలో తెలియక రైతులు అయోమయానికి గురువుతున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న చక్కెర కర్మాగారాలు సరైన గిట్టుబాటు ధరను ప్రకటించలేదన్నారు. గిట్టుబాటు ధర ఇప్పించేలా చూడాలన్నారు. సమావేశంలో నాయకులు జి.నర్సింహులు, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు  ఓటెయ్యండి: సునీతారెడ్డి1
1/2

బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు ఓటెయ్యండి: సునీతారెడ్డి

బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు  ఓటెయ్యండి: సునీతారెడ్డి2
2/2

బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు ఓటెయ్యండి: సునీతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement