పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
సంగారెడ్డి జోన్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పరితోష్ పంకజ్, అధికారులతో కలసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఎంపిక చేసిన మండల పరిషత్ కార్యాలయాలకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశామన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని, వెబ్ క్యాస్టింగ్ చేయిస్తున్నామని తెలిపారు. ఎస్పీ పరితోశ్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత పోలింగ్ నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టరు చంద్రశేఖర్, అదనపు ఎస్పీ రఘునందన్ రావు, రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు కార్తిక్‌రెడ్డి, వ్యయ పరిశీలకులు రాకేష్, జిల్లా పరిషత్తు సీఈఓ జానకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి అంశంపై అవగాహన
అభ్యర్థులను ఏజెంట్‌లుగా అనుమతించవద్దు
తొలివిడత ప్రచారానికి తెర
జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. తొలి విడతలో భాగంగా జిల్లాలో ఏడు మండలాల పరిధిలో ఉన్న 136 సర్పంచ్ స్థానాలతో పాటు 1246 వాడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఏడు సర్పంచి స్థానాలు, 113 వాడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 129 సర్పంచ్, 1133 వాడు స్థానాలకు ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తం 3,243 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, గురువారం జరిగే పోలింగ్‌లో 3,500 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
పటిష్టమైన బందోబస్తు: ఎస్పీ పరితోశ్


