ఏకగ్రీవాల జోష్..
నారాయణఖేడ్, కంగ్టి: నారాయణఖేడ్ డివిజన్‌లో 196 గ్రామపంచాయతీలు ఉండగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పలువురు అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నారాయణఖేడ్ మండల పరిధిలోని పంచగామలో సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉండగా వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యా రు. ఖాంజీపూర్ సర్పంచ్ పదవికి ఇద్దరు పోటీ పడుతుండగా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అల్లాపూర్ సర్పంచ్‌గా కమలానాయక్, షేరితండాలో హీరామన్, పీర్లా తండాలో సాలి బాయి, డీఎన్‌తండాలో కర్ర కమిలీబాయి, గుండుతండాలో మేఘావత్ మౌనిక, పలుగుతండాలో కిషన్‌నాయక్, మాణిక్ నాయక్ తండాలో మంజులా చౌహాన్, కిషన్‌నాయక్ తండాలో సునీతా చౌహాన్‌లు సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నాగల్‌గిద్దా మండలంలోని కేశ్వార్ గ్రామంలో ముంగేమహాదేవి, గంగారాం తండాలో రాథోడ్ రేణుక, కొండానాయక్ తండాలో అశోక్ చౌహాన్, రత్నానాయక్ తండాలో జైపాల్ రాథోడ్ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్హేర్ మండలంలోపి జామ్లాతండా సర్పంచ్‌గా గోవింద్ నాయక్, కంగ్టి మండలంలోని చందర్‌తండా సర్పంచ్‌గా శాంతాబాయి, జీర్గీతండాలో రాథోడ్ యమునాబాయి, నిజాంపేట్ మండలంలోని బల్కంచెల్కతండా సర్పంచ్‌గా సరిత, నాగన్నకుంట తండాలో దేవ్‌సోత్ సాలీబాయి, మాణిక్‌తండాలో మంజులా చౌహాన్ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. సిర్గాపూర్ మండలంలోని లక్ష్మణ్‌నాయక్ తండా సర్పంచ్‌గా దూరీబాయి, ఫత్తేనాయక్‌తండాలో మంగ్లూబాయి, కిషన్‌నాయక్‌తండాలో శిరీష రాథోడ్ , వంగ్ధాల్ గైరాన్‌తండాలో మోహన్, చందర్‌నాయక్‌తండాలో రుక్మిణీబాయి, వాసర్ తండాలో మంజుల, సిర్గాపూర్ గైరాన్‌తండాలో సర్పంచ్‌గా వినోద్‌లు ఏకగ్రీవమయ్యారు. సంబందిత అధికారులు నూతన సర్పంచ్‌లను అభినందించారు.
నారాయణఖేడ్‌లో 24 గ్రామపంచాయతీలు


