శిల్పాకారుడికి అరుదైన గౌరవం
ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి ప్రదర్శనకు ఆహ్వానం
న్యాల్‌కల్(జహీరాబాద్): ఎన్నో అద్భుత శిల్పాలు తయారు చేసి రాష్ట్రపతి చేత డాక్టరేట్, ప్రశంసా పత్రం, బంగారు పతకాన్ని అందుకున్న సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు హోతి బస్వరాజ్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ శిల్పకళా వర్క్‌షాప్ నడుపుతున్నాడు. ఆయన తయారు చేసిన అమ్మ ఒడిలో భూమాత, భారతీయ సంస్కృతిలో మానవుని ప్రతిరూపం ప్రదర్శనలు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ఈ నెల 9 నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో జాతీయ స్థాయి శిల్పకళా ప్రదర్శన జరగనుంది. అఖిల భారతీయ శిల్పకళా, క్రాప్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రదర్శనకు బస్వరాజ్‌కు ఆహ్వానం అందింది. తాను తయారు చేసిన ప్రదర్శనలు జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై బస్వరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.


