వీరోజిపల్లిలో 600 చీరల పట్టివేత
పెద్దశంకరంపేట(మెదక్): ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు తరలిస్తున్న చీరలను పోలీసులు పట్టుకున్నారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి వివరాల ప్రకారం... సోమవారం మండల పరిధిలోని వీరోజిపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 600 చీరలను ఎఫ్‌ఎస్‌టీ టీమ్ పట్టుకుంది. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరోజిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మన్నె కృష్ణ హైదరాబాద్ నుంచి వీటిని గ్రామానికి తరలిస్తున్నట్లు వాహన డ్రైవర్ తెలిపినట్లు పోలీసులు చెప్పారు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గరిచేయవద్దని సూచించారు. తనిఖీల్లో ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌టీ టీం సభ్యులు రమేశ్, సంగమేశ్వర్ తదితరులున్నారు.


