● మేనిఫెస్టో విడుదల చేసిన ఝాన్సీలింగాపూర్ సర్పంచ్ అభ్
రామాయంపేట(మెదక్): ఓ సర్పంచ్ అభ్యర్థి హామీల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలో ఆడపిల్ల పెళ్లికి రూ.11 వేలు ఆర్థిక సహాయం, ఆడపిల్ల పుడితే రూ. 5వేలు, నిరుపేదలు మృతి చెందితే దహన సంస్కారాల నిమిత్తం రూ.5 వేలు, కోతుల బెడద నివారణ తదితర కార్యక్రమాలు చేపడుతానని మండలంలోని ఝాన్సీలింగాపూర్ సర్పంచ్ అభ్యర్థి మానెగల్ల రామకిష్టయ్య హామీలిచ్చారు. సోమవారం ఆయన గ్రామ ప్రజల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేశారు. గ్రామంలో అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్, మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం, బస్తీ దవాఖాన ఏర్పాటు, బైపాస్ రోడ్డు నుంచి సదాశివనగర్ తండా వరకు తారు రోడ్డు, మినీ ట్యాంకుల నిర్మాణం, నూతన వైకుంఠ రథం వంటి పనులు చేస్తానని తెలిపారు. తనను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. రామకిష్టయ్య ప్రచారానికి గ్రామంలో మంచి స్పందన లభిస్తుంది.


