తొలిసారి..బరిలోకి..
● మండలంలో 16 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు పోటీ ● ఆ పార్టీ వైపు యువత మొగ్గే కారణమా?
హత్నూర (సంగారెడ్డి): మండలంలో గతంలో ఒక స్థానానికి కూడా పోటీ చెయ్యని బీజేపీ మద్దతుదారులు ప్రస్తుతం గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌తోపాటు వార్డు స్థానాలకు బరిలో నిలిచారు. అయితే యువత కాషాయం వైపు మొగ్గుచూపుడమే ఇందుకు కారణమంటూ గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఇతర అభ్యర్థులకు మద్దతు ఇచ్చే బీజేపీ నాయకులు, యువకులు, ప్రస్తుతం స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసి తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. మండల కేంద్రమైన హత్నూరలో బీజేపీ మద్దతుతో పొట్లగళ్ల శంకర్ బరిలో నిలిచి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దౌల్తాబాద్‌లో బిట్ల విజయలక్ష్మి, కాసాలలో నవీన్, రెడ్డి ఖానాపూర్‌లో జైపాల్, బోరపట్లలో మల్లేశం, చందాపూర్‌లో రామరాజు, మధురలో రవి, చిక్ మద్దూర్‌లో కల్పన శ్రీశైలం, సిరిపురంలో చంద్రమోహన్ రెడ్డి, నవాబుపేటలో మంజుల పోటీలో నిలిచారు. మల్కాపూర్‌లో అనిత, కొత్తగూడెంలో రాజు నాయక్, దేవులపల్లిలో ప్రవీణ్, గోవిందరాజు పల్లిలో బాలయ్య, వడ్డేపల్లిలో మల్లేశం బీజేపీ మద్దతుతో బరిలో ఉన్నారు. కానీ మొదటిసారి బీజేపీ అభ్యర్థులు బరిలో నిలవడం వల్ల ఏ పార్టీకి నష్టం.. ఏ పార్టీకి లాభం అన్న విషయంపై గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడైతే భవిష్యత్తు తేలనుంది.
మద్యం, మాంసానికి మస్తు గిరాకీ


