● బ్రాహ్మణపల్లి ఓటరు జాబితాలో 40 మంది మృతులు! ● రెండుస
నర్సాపూర్ రూరల్: మండలంలోని బ్రాహ్మణపల్లి ఓటర్ జాబితాలో సుమారు 40 మందికి పైగా మృతుల పేర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న వాళ్దాస్ సత్యగౌడ్ ఈ విషయమై నర్సాపూర్ ఆర్డీఓకు ఫిర్యాదు చేసేందుకు వెళుతూ విలేకరులకు ఓటర్ జాబితా గూర్చి వివరించారు. గ్రామంలో 40 మందికి పైగా మృతి చెందిన వారి పేర్లు, ఫొటోలు ఓటర్ జాబితాలో ఉన్నాయని తెలిపారు. దీంతోపాటు 20 మందికి పైగా రెండు చోట్ల పక్కపక్కనే ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయన్నాడు. పలుమార్లు ఓటర్ జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నాయని వివిధ దినపత్రికల్లో వార్తలు ప్రచురితమైనా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించాడు. మృతులతో పాటు రెండు చోట్ల ఓటు ఉన్న అభ్యర్థుల ఓట్లు పోల్ అయితే గొడవలు జరిగే అవకాశం ఉందని పోటీలో ఉన్న అభ్యర్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఆర్డీఓతో పాటు కలెక్టర్‌కు తప్పులు తడకగా ఉన్న ఓటరు జాబితాపై ఫిర్యాదు చేయనున్నట్లు పోటీల్లో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తెలిపారు. కొన్ని చోట్ల పేర్లు మారినా ఫొటోలు మారలేదని తెలిపారు.
గెలిపిస్తే.. ఆడబిడ్డ పెళ్లికి సాయం


