యువకుడి ఆత్మహత్యాయత్నం
డయల్ 100కు కాల్.. కాపాడిన పోలీసులు
వట్‌పల్లి(అందోల్): సెల్‌ఫోన్ కోసం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు కాపాడారు. ఈ ఘటన ఆదివారం అందోల్ మండల పరిధిలోని సంగుపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన కృష్ణ ఫోన్‌ను ఇంట్లో నుంచి తన స్నేహితుడు ఎత్తుకెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు ఇంట్లోనే ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గమనించిన గ్రామస్తుడు 100కు కాల్ చేయడంతో జోగిపేట పోలీసులు శ్రీకాంత్, అరవింద్ వెంటనే గ్రామానికి వెళ్లి చీరతో దూలానికి ఉరి వేసుకుంటుండగా అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్యాపిల్లలను బలవంతంగా బయటకు వెల్లగొట్టి కృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కానిస్టేబుల్ తెలిపారు. తన స్నేహితుడు సుధాకర్ ఫోన్‌ను దొంగిలించినట్లు కృష్ణ తెలపడంతో పోలీసులు అతడి నుంచి ఫోన్ రికవరీ చేశారు. 5 నిముషాలు ఆలస్యమైనా ఉరి వేసుకొని ప్రాణం తీసుకునేవాడని, పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి కృష్ణను కాపాడినందుకు స్థానికులు అభినందించారు.


