చేపల లారీ బోల్తా
ఇద్దరికి స్వల్ప గాయాలు
హుస్నాబాద్‌రూరల్: మండలంలోని జిల్లెలగడ్డ పోలీసు చెక్ పోస్టు వద్ద శనివారం రాత్రి పోలీసు హవానాన్ని ఢీకొట్టిన లారీ బోల్తా పడింది. వివరాలు ఇలా... హన్మకొండ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న చేపల లారీ పోలీసు జీపును ఢీకొట్టడంతో అది కిందకు దూసుకెళ్లింది. ఆ సమయంలో వాహనంలో పోలీసులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బోల్తా పడిన లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు కావడంతో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం పరిశీలించి పోలీసు వాహనాన్ని బయటకు తీసి స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్, ఏలూరు నుంచి చేపల లోడుతో లారీ ఢిల్లీకి వెళ్తుందని, ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


