సర్పంచ్ బరిలో ఫీల్డ్ అసిస్టెంట్
ఉద్యోగానికి రాజీనామా
న్యాల్‌కల్(జహీరాబాద్): సర్పంచ్ పదవి కోసం నాయకులతో పాటు చిరుద్యోగులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఎలాగైనా గెలువాలనే ఉద్దేశంతో కొందరు చిరుద్యోగులు రాజీనామాలు సైతం చేస్తుండగా మరి కొందరు తమ సతులను బరిలోకి దింపుతున్నారు. న్యాల్‌కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామానికి చెందిన ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్ కొనదొడ్డి సుకుమార్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు.నామినేషన్ కూడా వేశారు. ఇదిలా ఉండగా మండల పరిధిలోని అమీరాబాద్‌కు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తన సతీమణిని సర్పంచ్ బరిలోకి దింపారు.
ముగిసిన మూడో విడత
నామినేషన్లు
సంగారెడ్డి జోన్: పంచాయతీ సమరానికి నామినేషన్‌ల ప్రక్రియ పూర్తయింది. మూడు విడతలలో క్లస్టర్ల వారిగా ఏర్పాటు చేసిన కేంద్రాలలో అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. చివరి విడతలో భాగంగా ఆఖరి రోజు జోరుగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. జిల్లాలో 613 గ్రామపంచాయతీలు, 5370 వార్డు స్థానాలు ఉన్నాయి. రెండో విడతలో స్వీకరించిన నామినేషన్ల అభ్యర్థుల స్కూటీని ఇప్పటికే పూర్తి చేశారు. శనివారం మధ్యాహ్నం 3:00 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 3 గంటల తర్వాత పోటీ అభ్యర్థుల తుది జాబితాతో పాటు వారికి గుర్తులు సైతం ప్రకటిస్తారు. కాగా, మూడో విడతలో సర్పంచ్ పదవికి 356, వార్డు స్థానానికి 791 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చివరి రోజు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఐదు గంటల లోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి స్వీకరణ ప్రక్రియ జరిగింది.
19 నుంచి గీతంలో
అంతర్జాతీయ సదస్సు
ఔషధ ఆవిష్కరణ,
అనువాద పరిశోధనపై చర్చ
పటాన్‌చెరు: దేశంలోని ప్రయోగశాల జంతు శాస్త్రవేత్తల సంఘం సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధన’ పేరిట అంతర్జాతీయ సదస్సు ఈనెల 19నుంచి 20 తేదీలలో నిర్వహించనున్నారు. అలాగే ఈ 13వ అంతర్జాతీయ ప్రీక్లినికల్ సదస్సుకు ముందు డిసెంబర్ 18న వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహక కార్యదర్శులు డాక్టర్ సుహాసిన్, డాక్టర్ ఎంజే మహేష్ కుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ వర్క్ షాప్‌లో ప్రీక్లినికల్ పరిశోధన నాణ్యతను పెంపొందించడం, శాసీ్త్రయ అధ్యయనాల్లో ప్రయోగశాల జంతువుల నైతిక, మానవీయ, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలు, పేర్ల నమోదు కోసం వెబ్ సైట్లను సందర్శించాలని సూచించారు.
అర్థమయ్యేటట్లు బోధించాలి
సదాశివపేట(సంగారెడ్డి): టీఎల్‌ఎం, నూతన పద్ధతుల్లో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించాలని, అప్పుడే విద్యార్ధులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారని జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సదాశివపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయుడు బోధి స్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా ప్రతి తరగతిలో విద్యార్ధులతో తెలుగు, ఆంగ్లం చదివించాలని కోరారు. గణితంలో చదుర్విద ప్రక్రియలు తప్పనిసరిగా రావాలన్నారు. అయితే.. నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట సీఎంఓ వెంకటేశం, ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు.
దరఖాస్తు చేసుకుంటే
పోస్టల్ బ్యాలెట్
మెదక్ కలెక్టరేట్: పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యా లెట్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ తీరుపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా అర్హులకు పోస్టల్ బ్యాలెట్ అందించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్‌ను నియమించాలన్నారు.
సర్పంచ్ బరిలో ఫీల్డ్ అసిస్టెంట్


