భూమి ఆరోగ్యంగా ఉంటేనే..
జహీరాబాద్: భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆశించిన మేర పంట దిగుబడులు సాధ్యమని డీడీఎస్–కేవీకే శాస్త్రవేత్త సి.వరప్రసాద్ అన్నారు. శుక్రవారం కేవీకేలో నిర్వహించిన మట్టి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు భూముల సారాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అప్పుడే సాగు చేసుకున్న పంటలు మంచి దిగుబడులను సాధించగలుగుతారని పేర్కొన్నారు. డీడీఎస్–కేవీకే నుంచి ఇప్పటి వరకు 24128 మట్టి నమూనాలు పరీక్షించడం జరిగిందన్నారు. ఇందులో 23710 భూసార పరీక్షలు చేసి రైతులకు అందించామన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని దానికి తగ్గట్టుగా ఎరువుల యాజమాన్యం చేసుకుని భూమి ఆరోగ్యం పెంచుకునేలా కృషి చేయాలని వివరించారు. భూమి ఆరోగ్యంగా ఉండేలా సేంద్రియ ఎరువులు వేసుకోవాలని, వర్షాకాలంలో పచ్చిరొట్టె కింద జనుము వేసుకోవాలని, జీవన ఎరువులను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సాయిప్రియాంక, ఎన్.స్నేహలత, జి.శైలజ, వి.రమేష్, ఎం.హేమలత, కై లాష్, భూసార పరీక్షల నిపుణుడు ఇ.స్వామి, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మంచి దిగుబడులకు ఆస్కారం
మట్టి పరీక్షలు తప్పని సరి
శాస్త్రవేత్త వరప్రసాద్


