ఓట్ల వేలంపై సీరియస్
కల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని ఫత్తేపూర్‌లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం కుల సంఘం ఓట్ల కోసం వేలం విషయమై అధికారులు సీరియస్ అయ్యారు. శుక్రవారం కల్హేర్‌లో నామినేషన్ కేంద్రాలు తనిఖీ చేసేందుకు వచ్చిన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి అధికారులతో ఆరా తీశారు. ఓ కుల సంఘం ఓట్ల కోసం రూ.10 లక్షలకు వేలం జరిగిందనే పత్రికల్లో వచ్చిన వార్తలపై చర్చించారు. తహసీల్దార్ శివశ్రీనివాస్, ఎంపీడీఓ మహేశ్వర్‌రావు, ఎస్‌ఐ రవిగౌడ్‌తో మాట్లాడారు. వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
ఇబ్బందులు లేకుండా చూడండి
నారాయణఖేడ్: మండలంలోని వెంకటాపూర్ క్లస్టర్‌ను శుక్రవారం పంచాయతీ ఎన్నికల జిల్లా సాధా రణ పరిశీలకుడు కార్తీక్ రెడ్డి, సబ్‌కలెక్టర్ ఉమాహారతి సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అప్పటివరకు దాఖలైన నామినేషన్ల సంఖ్యను తెలుసుకుని నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారివెంట ఖేడ్ ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
విచారణకు సబ్‌కలెక్టర్ ఆదేశం


