గ్రామాల్లోనే ఎన్నికల సామగ్రి
అల్లాదుర్గం(మెదక్): పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయిండంతో నమూనా బ్యాలెట్ పత్రాలు, జేబులకు పెట్టుకునే గుర్తులు ఎన్నికల సామగ్రి కోసం పట్టణాలకు పరుగులు తీస్తారు. అయితే, సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు కేటాయించిన గుర్తులు, పార్టీల కండువాలను ఓ మహిళా అల్లాదుర్గంలో విక్రయిస్తుండగా అభ్యర్థులు కొనుగోలు చేశారు.
ఐదుగురి మహిళలపై కేసు
కొండపాక(గజ్వేల్): కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో అల్లుడి తల్లిపై దాడి చేసిన ఐదుగురు మహిళలపై కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. కొండపాకకు చెందిన జక్కని చంద్రశేఖర్, అక్షిత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 3న వివాహం చేసుకొని ఇంటికి వచ్చారు. అక్షిత తల్లి రమణతో పాటు మౌనిక, రాధ, సత్తెవ్వ, విజయలు బుధవారం రాత్రి చంద్రశేఖర్ ఇంటి వద్దకు వెళ్లి తల్లి జక్కని లక్ష్మిపై దాడి చేశారు. దీంతో లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


