మా ఓటు మీకే
మునిపల్లి(అందోల్): సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్ వేసినప్పటి నుంచి అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో అంతుపట్టడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మద్దతుతో పోటీకి దిగారు. అభ్యుర్థులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటు వేయాలని కోరడంతో మీకే మా ఓటు అంటున్నారు. నామినేషన్ వేసిన సర్పంచ్, వార్డు సభ్యులు ఎవరొచ్చి అడిగినా మీకే ఓటు వేస్తామంటున్నారు. ఎవరిని నమ్మాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో ఇతర పార్టీల నుంచి మరో పార్టీలో చేరి కొంతమంది సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పోటీలో నిలిచారు. జనరల్ వచ్చిన సర్పంచ్ స్థానాల్లో మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌లు పోటీ చేస్తున్నారు. దీంతో మండలంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
అభ్యర్థుల్లో టెన్షన్


