మద్యం ఎందుకు తాగుతున్నావ్..?
ప్రశ్నించినందుకు తండ్రి ఆత్మహత్య
వెల్దుర్తి(తూప్రాన్): మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు ఆత్మహత్యకు చేసుకున్నా డు. ఈ ఘటన మాసాయిపేట మండలం కొప్పులపల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవునూరి పోచమల్లు(57) కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 2న రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. డాక్టర్లు వద్దని చెప్పినా మద్యం ఎందుకు తాగుతున్నావంటూ కుమారులు నిలదీశారు. దీంతో బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా.. తన వ్యవసాయ పొలం వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


