పోలీసులకు మందుబాబు చుక్కలు
అల్లాదుర్గం(మెదక్): మద్యం మత్తులో పోలీసులకు చుక్కలు చూపించాడు ఓ మందుబాబు. అల్లాదుర్గంలో గురువారం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపగా, కారును ఆపకుండా కొద్ది దూరం వెళ్లాడు. మద్యం మత్తులో ఉండటంతో పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించడానికి ప్రయత్నించగా, సహకరించలేదు. మద్యం తాగిన వ్యక్తి వెంట అతడి భార్య సైతం ఉండటం గమనార్హం. పోలీసులను ఇబ్బంది పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకర్ చెప్పారు. అల్లాదుర్గంలో ఐకేపీ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న గంగారంగా గుర్తించినట్లు తెలిపారు.


