టాసు.. కవితకే బాసు!
నారాయణఖేడ్: ఎన్నికల సమరంలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. నారాయణఖేడ్ మండ లం ఽగంగాపూర్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతుండడంతో టాస్‌వేసి అభ్యర్థిని ఎంపిక చేశారు. గంగాపూర్ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయింది. పంచాయతీలో 912 మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ పదవి కోసం పడాల కుటుంబానికి చెందిన కవితారెడ్డి, ప్రమీలారెడ్డి పోటీ పడ్డారు. ఇరువురు కూడా కచ్చితంగా పోటీ చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు సమావేశమై వీరి మధ్య రాజీ కుదర్చడానికి యత్నించారు. ఇరువురూ వెనక్కి తగ్గలేదు. దీంతో టాస్ ద్వారా అభ్యర్థిత్వా న్ని ఖరారు చేస్తామన్నారు. టాస్ వేయడంతో కవితారెడ్డికి వరించింది. అనంతరం ప్రమీలారెడ్డి అనుచరులు తాము కచ్చితంగా పోటీలో ఉంటామ ని అక్కడి నుంచి వెళ్లినప్పటికీ టాస్‌లో పాల్గొన్న పెద్దలు మాటకు కట్టుబడాలని పేర్కొన్నారు.
గంగాపూర్‌లో విచిత్రం


