ముచ్చటగా ముగ్గురు
న్యాల్‌కల్(జహీరాబాద్): ఒకే కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నిక కావడం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచ్‌లుగా ఎన్నిక కావడం అరుదు. న్యాల్‌కల్ మండల పరిధి గుంజోటి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్‌లుగా పని చేశారు. గ్రామానికి చెందిన చంద్రప్ప 1988లో సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందారు. 2007లో జరిగిన ఎన్నికల్లో చంద్రప్ప తల్లి శివమ్మ గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రప్ప భార్య చిన్నమ్మ విజయం సాధించారు. ఇలా వరుసగా ఒకే కుటుంబంలో కొడుకు, తల్లి, భార్య ముగ్గురు సర్పంచ్‌గా పని చేశారు. ఇదిలా ఉండగా 1988లో సర్పంచ్‌గా గెలుపొందిన చంద్రప్ప 1995లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందారు. అలాగే, 2001లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో హద్నూర్ ఎంపీటీసీగా గెలుపొందారు. సర్పంచ్‌గా గెలుపొందిన ఆయన భార్య చిన్నమ్మ 2001, 2006లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో గుంజోటి నుంచి పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా చిన్నమ్మ పోటీలో ఉన్నారు. గురువారం భర్త చంద్రప్పతో కలసి నామినేషన్ దాఖలు చేశారు.
ఫ్యామిలీ ప్యాక్


