తమ్మీ.. అంతా బాగేనా!
దుబ్బాకటౌన్: ఏం తాత ఎలా ఉన్నావ్.. అంత మంచిదేనా? పొద్దునే చలిలో ఎక్కడ పోతున్నవ్.. చాయ్ తాగినవా లేదా? దా మరి మనోని హోటల్‌కి పోయి ఛాయ్ తాగుదాం..! అయితే ఏం లేదు తాత రానున్న ఎన్నికలో సర్పంచ్‌గా నిలబడ్డా.. మన గుర్తుకు ఓటు వేయాలి. నేను గెలిస్తే ఏ సమస్య వచ్చిన అంతా చూసుకుంటా.. అంటూ బంధాలతో అభ్యర్థులు జోరుగా ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా అభ్యర్థులు ఉదయం ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
బేరసారాలు షురూ..
ఎన్నికలు సమీస్తున్న తరుణంలో రాత్రి సమయాల్లో రహస్య మంతనాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే జిలాల్లోని పలు గ్రామాల్లో బడా నాయకులను దాబాల్లో, పర్మిట్ రూంల్లో, బార్‌ల్లో ఎక్కడో ఒక్క చోట మద్యం సిట్టింగ్ నిర్వహించి రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. మనసులో ఏం పెట్టుకోకుండా ఓట్లు వేయించమని బేరసారాలు చేస్తున్నట్లు వినికిడి. ఇలా సూర్యాస్తమయం అయిందంటే చాలు దాబాలు, పర్మిట్ రూంలు, బార్‌లు సందడిగా మారుతున్నాయి.
గుర్తుకొస్తున్న బంధాలు


