గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
వెల్దుర్తి(తూప్రాన్): చేపలు పట్టడానికి వెళ్లి హల్దీవాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన మండలంలోని హస్తాల్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గంగిరెద్దులవాడకు చెందిన ఆవుల దుర్గయ్య(45), జానపాటి సాయిలుతో కలిసి బుధవారం మధ్యాహ్నం గ్రామశివారులోని హల్దీవాగులో చేపలు, పీతలు పట్టడానికి వెళ్లారు. సాయంత్రం వాగు నుంచి బయటకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు దుర్గయ్య నీటమునిగి గల్లంతయ్యాడు. రాత్రి వరకు గజ ఈతగాళ్ల సాయంతో వెతికినా ఫలితం లేకపోగా గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం..
పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని కమలాపూర్ శివారులో జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి గురువా రం తెలిపారు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.


