నాడు సర్పంచ్.. నేడు పొలం పని
చిలప్‌చెడ్(నర్సాపూర్): రాజకీయంలో పదవి ఉంటే అందరూ దగ్గరవుతారు. పదవి పోతే ఎవరూ పట్టించుకోరు. గిరిజనులైతే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం చండూర్ పరిధిలోని గిరిజనతండాలు ఉండగా 2014 స్థానిక ఎన్నికల్లో ఆ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. గ్రామ పరిధిలోని గుజిరితండాకు చెందిన రమావత్ లక్ష్మి తన భర్త రాజు ప్రోత్సాహంతో ఎన్నికల్లో పోటీచేసింది. సమారు 255 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థిపై గెలుపొంది సర్పంచ్‌గా ఎన్నికై ంది. గ్రామానికి ఐదేళ్లు సేవ చేసింది. సర్పంచ్ పదవి ముగిశాక తనని పట్టించుకున్న పార్టీ లేదు, నాయకులు లేరు. ప్రస్తుతం లక్ష్మి తనకున్న పొలంతోపాటు, మరికొంత పొలం కౌలుకు తీసుకుని కూరగాయలు పండిస్తూ జీవనం సాగిస్తోంది. ప్రస్తుత ఎన్నికలపై ఆమెతో మాట్లాడగా.. తనకు ఎలాంటి పదవులపై ఆసక్తి లేదని చెప్పింది.


