285 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
తూప్రాన్: పట్టణ సమీపంలోని బైపాస్ మార్గం 44వ జాతీయ రహదారిపై గురువారం 285 క్వింటాళ్ల రేషన్ బియ్యం కలిగిన లారీని విజిలెన్స్ అధికా రులు పట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండో సారి రేషన్ పట్టుబడడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కొండల్‌వాడికి లారీలో 285.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తు న్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్‌లై రాష్ట్ర విజిలెన్స్ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో తూప్రాన్ బైపాస్ మార్గంలో దాడి చేసి లారీని పట్టుకున్నారు. లారీని తనిఖీ చేసి రేషన్ బియ్యంగా గుర్తించారు. స్థానిక పోలీసులు, జిల్లా గోడౌన్ డీఎస్ ఓ ఇన్‌స్పెక్టర్ నర్సింలు సమక్షంలో పట్టణంలోని సివిల్ సప్లై గోడౌన్‌లో పట్టుబడిన లారీలోని రేషన్ బియ్యాన్ని ఖాళీ చేయించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.


