హిందూ దేవుళ్లనే అవమానిస్తారా?
బీజేపీ జిల్లా కార్యదర్శి భూమయ్య
జోగిపేట(అందోల్): హిందూ దేవుళ్లను అవమానించే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడినందుకు గాను బుధవారం అందోలు బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పట్టణంలోని హనుమాన్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నవాబుగారి భూమయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సీఎం వ్యాఖ్యలు చేశారన్నారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షురాలు పావని మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై సీఎం వ్యంగంగా మాట్లాడడం హిందువులను అవమానపరచడమేనన్నారు. సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. అనంతరం పోలీసుల జోక్యంతో రాస్తారోకోను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో కన్వీనర్ మహేష్కర్ సుమన్, ఎస్‌టీ మోర్చా అధ్యక్షుడు రవీందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి నందకుమార్, పాపయ్య సురేష్, ఉపాధ్యక్షులు వాణి రమేష్, నరసింహారెడ్డి, బసవ రెడ్డి, గడ్డమీద రాజు, వట్టిపల్లి ఉపాధ్యక్షులు శివమూర్తి, అల్లాదుర్గం ఉపాధ్యక్షులు సాయిలు, నాయకులు రమేష్, నాయకులు పాల్గొన్నారు.


