కోరలు చాచిన ప్లాస్టిక్‌ భూతం! | - | Sakshi
Sakshi News home page

కోరలు చాచిన ప్లాస్టిక్‌ భూతం!

Nov 18 2025 8:31 AM | Updated on Nov 18 2025 8:31 AM

కోరలు

కోరలు చాచిన ప్లాస్టిక్‌ భూతం!

● పట్టణంలో రోజుకి 50 టన్నుల చెత్త సేకరణ ● వాటిలో ప్లాస్టికే అధికం ● పట్టించుకోని అధికారులు ● అమలు కాని నిషేధం విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం నిషేధం పేరుకు మాత్రమే

ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే

విచ్చలవిడిగా వినియోగం
● పట్టణంలో రోజుకి 50 టన్నుల చెత్త సేకరణ ● వాటిలో ప్లాస్టికే అధికం ● పట్టించుకోని అధికారులు ● అమలు కాని నిషేధం

సంగారెడ్డి జోన్‌: పర్యావరణంతో పాటు ప్రజలకు, పశువులకు హాని కలిగించే ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది, ప్రాణాంతకం తెలిసినప్పటికీ అధికారులతో పాటు విద్యావంతులు, సాధారణ జనాలు విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. పట్టణంతో పాటు గ్రామాలలో దుకాణాలలో విక్రయించే వివిధ రకాల సామగ్రి కవర్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు. వీటి వినియోగంతో ముంపు పొంచి ఉందని అధికార యంత్రాంగం ప్లాస్టిక్‌ నిషేధించినప్పటికీ పలువురు అధికారుల నిర్లక్ష్యం, ప్రజల్లో అవగాహన లోపంతో వినియోగం పెరుగుతూ వస్తుంది.

ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోంది. కూరగాయల మార్కెట్లు, వివిధ రకాల దుకాణాలు, నాన్‌ వెజ్‌ దుకాణాలతో పాటు ఫంక్షన్లలో అధిక శాతం వీటినే వినియోగిస్తున్నారు. కవర్లు, ప్లేట్లు, గ్లాసులు ప్లాస్టిక్‌ సంబంధించినవే వాడుతున్నారు. గతంలో ఎలాంటి శుభకార్యాలు జరిగిన ఆకులతో తయారుచేసిన విస్తరాకులు, స్టీల్‌ గ్లాసులు, మార్కెట్‌కు వెళ్లే సమయంలో సంచి, బ్యాగ్‌ వంటివి వెంట తీసుకుని వెళ్లేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో గతం కంటే పూర్తిగా భిన్నంగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు.

ప్లాస్టిక్‌ నిషేధించాలన్నది పేరుకు మాత్రమేనని అమలు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులే ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లను వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే దుష్పరిణామాలు ప్రజలకు అవగాహన కల్పించలేకపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ కూడా కలిసి అవగాహన సదస్సులు నిర్వహించలేకపోతున్నారు. అంతేకాకుండా తనిఖీలు సైతం చేపట్టడం లేదు.

ప్రతిరోజు 50 టన్నుల చెత్త సేకరణ

జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి పట్టణంలో ప్రతిరోజు 50 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది అందులో అత్యధికంగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలే ఉంటున్నాయి. మున్సిపల్‌ పరిధిలో 38 వార్డులు ఉండగా 50 వాహనాల ద్వారా 254 మంది కార్మికులు చెత్తను సేకరిస్తున్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా 14 మున్సిపాలిటీలు, 613 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇళ్లతో పాటు దుకాణాల నుంచి వినియోగించిన కవర్ల చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. పట్టణంలో ప్రతిరోజు చెత్తను సేకరించకపోవడంతో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా మున్సిపల్‌ పరిధితో పాటు గ్రామాలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరింత అవగాహన కల్పిస్తాం

ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్‌ వినియోగించరాదని ఇప్పటికే దుకాణాలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాం. మరింత విస్తృతంగా వినియోగంతో కలిగే నష్టాలపై ప్రజలకు వివరిస్తాం. అధికారులతో పాటు ప్రజలు కూడా ప్లాస్టిక్‌ వినియోగంపై సహకరించాలి. –శ్రీనివాస్‌ రెడ్డి,

మున్సిపల్‌ కమిషనర్‌, సంగారెడ్డి

మురికి కాలువలు, డ్రైనేజీలు, చెత్తకుప్పలు ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే అధికంగా దర్శనమిస్తున్నాయి. దుకాణదారులతోపాటు ఫంక్షన్‌ హాల్‌లో నిర్వాహకులు చెత్తను తీసుకువచ్చి రోడ్డు పక్క పారబోస్తున్నారు. సిబ్బంది సైతం ప్రతిరోజు సేకరించకపోవడంతో చెత్త పేరుకుపోతుంది. దీంతో పశువులు సంచరించి తినటంతో అనారోగ్యం పాలవడంతోపాటు మృత్యువాత పడుతున్నాయి. మరి కొన్ని చోట్ల కాల్చి వేయడంతో పర్యావరణం దెబ్బతింటుంది.

కోరలు చాచిన ప్లాస్టిక్‌ భూతం!1
1/2

కోరలు చాచిన ప్లాస్టిక్‌ భూతం!

కోరలు చాచిన ప్లాస్టిక్‌ భూతం!2
2/2

కోరలు చాచిన ప్లాస్టిక్‌ భూతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement