గ్రంథాలయాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: సీఎస్‌ఆర్ నిధుల సహకారంతో గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామని కలెక్టర ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డిలోని జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో సోమవారం ఆమె మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో ముద్రిత గ్రంథాలయంతోపాటు డిజిటల్ సేవలు కూడా ముఖ్యమేనన్నారు. కాగా, వారోత్సవాల్లో భాగంగా క్విజ్, వ్యాస రచన పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
అధికారుల నిర్లక్ష్యం తగదు
ప్రజావాణిలో వచ్చిన సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అధికారులతో కలిసి ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు 25 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పద్మజారాణి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రూ.1.75 కోట్ల
నిధులు విడుదల
పాఠశాలలు, ఎమ్మార్సీలు, సీఆర్‌సీలకు వినియోగం
న్యాల్‌కల్(జహీరాబాద్): పాఠశాల, మండల వనరుల కేంద్రం (ఎంఆర్‌సీ), క్లస్టర్ రిసోర్స్ సెంటర్ (సీఆర్‌సీ) నిర్వహణకు ప్రభుత్వం రూ.1.75కోట్లు విడుదల చేసింది. జిల్లాలో 1108 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతా పాఠశాలలతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సుమారు 1.10లక్షలు మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాగే.. 29 ఎంఆర్‌సీలు, 85 సీఆర్‌సీలు ఉన్నాయి. ఈ నిధులతో చాక్‌పీస్‌లు, పరీక్షల నిర్వహణ, పరిశుభ్రత, పేరెంట్స్ మీటింగ్, ఫర్నిచర్, టెలిఫోన్, కరెంట్ బిల్లులు, సమావేశాలు తదితర కార్యక్రమాలను చేపడుతారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు నిర్వహణ నిధులు మంజూరు చేస్తుండగా, ఎంఆర్‌సీకి రూ.95వేలు, క్లస్టర్ల నిర్వహణ కోసం రూ.33వేలు చొప్పున ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తుంది.
నేటి నుంచి సైన్స్ ఫెయిర్
పరిశీలించిన సబ్‌కలెక్టర్, డీఈవో
నారాయణఖేడ్: పట్టణ శివారులోని ఈ–తక్షిల పాఠశాలలో మంగళవారం నుంచి 20వ తేదీ వరకు నిర్వహిచనున్న జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డుల ప్రదర్శనలకు సంబంధించిన ఏర్పాట్లు సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి పి.సిద్దారెడ్డిలు సోమవారం పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సైన్స్ ఫేయిర్‌ను ప్రారంభిస్తారని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సదస్సులో 7 విభాగాల్లో దాదాపు 700 విజ్ఞాన ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్దారెడ్డి, డీసీఈబీ సెక్రటరీ లింబాద్రి, ఎంఈవోలు మన్మధ కిషోర్, విశ్వనాథ్, నాగారం శ్రీనివాస్, రాములు, రాజశేఖర్ అద్యాపకులు ఉన్నారు.
అర్థమయ్యే రీతిలో
విద్యాబోధన చేయాలి
పటాన్‌చెరు టౌన్: ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రమేష్ అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల రీడింగ్ స్కిల్స్‌ను, ఉపాధ్యా యుల పనితీరును పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని సూచించారు.
గ్రంథాలయాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు


