5 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు | - | Sakshi
Sakshi News home page

5 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు

Nov 18 2025 8:31 AM | Updated on Nov 18 2025 8:31 AM

5 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు

5 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు

● ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ● జాతీయ రహదారి విస్తరణ పనులపై సమీక్ష

● ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ● జాతీయ రహదారి విస్తరణ పనులపై సమీక్ష

పటాన్‌చెరు: నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, పటాన్‌చెరు డివిజన్‌ల పరిధిలో ఐదు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం జాతీయ రహదారణ సంస్థ, పోలీసు, ట్రాఫిక్‌ శాఖల అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి ఫుట్‌ ఓవర్‌ వంతెనలు నిర్మించబోయే స్థలాలలో ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పర్యటన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తా నుంచి పటాన్‌చెరు పట్టణంలోని సాకి చెరువు వరకు ప్రతిరోజు నిత్యం వేలాది మంది ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం రహదారిని దాటుతూ ఉంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను ఐదు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించబోతున్నట్లు తెలిపారు. రామచంద్రపురం డివిజన్‌ పరిధిలోని అశోక్‌నగర్‌,. బీరంగూడ ఐటిఐ, రామచంద్రపురం రైల్వే లైను, పటాన్‌చెరు బస్టాండ్‌, సాకి చెరువు సమీపంలో వీటిని నిర్మించబోతున్నట్లు తెలిపారు. విశాలమైన విస్తీర్ణంతో, లిఫ్ట్‌ సౌకర్యంతో వీటిని నిర్మించబోతున్నట్లు తెలిపారు. నిర్దేశించిన గడువులోగా రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యేతో వెంట జాతీయ రహదారుల సంస్థ డీఈ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement