ఏసీబీ దాడుల కలకలం
● సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో తనిఖీలు
● రూ.42,300 నగదు స్వాధీనం
జహీరాబాద్: స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై శుక్రవారం సాయంత్రం ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ విలేకరులతో మాట్లాడుతూ పదిమంది ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి రూ.42,300 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అమ్మకాలు, కొనుగోలు చేసేవారు మాత్రమే ఉండాలని, కానీ ప్రైవేటు వ్యక్తులు ఉన్నారన్నారు. 113 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లభించాయని పేర్కొన్నారు. సంబంధీకులకు ఎందుకు అందజేయలేదనే దానిపై విచారణ జరుపుతామన్నారు. కార్యాలయ ఆధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో డాక్యుమెంట్ రైటర్లు షట్టర్లు మూసి పరారయ్యారు. కాగా, అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.


