పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టండి: మెదక్ ఆర్డీఓ
అల్లాదుర్గం(మెదక్): పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులపై దృష్టి పెట్టాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. మంగళవారం అల్లాదుర్గం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బందితో పలు అంశాలపై సమీక్షా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ, ప్రజావాణి మీసేవా సమస్యలపై చర్యలు తీసుకొవాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య పాల్గొన్నారు.
పెట్రోల్ పంపు స్థలం పరిశీలన
రేగోడ్(మెదక్): మండలంలోని తాటిపల్లి సమీపంలో నిర్మించతలపెట్టిన పెట్రోల్ పంపు స్థలాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి మంగళవారం సందర్శించారు. తాటిపల్లి వద్ద బసవేశ్వర ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ పెట్రోల్ పంపు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పంపు ఏర్పాటు చేసే స్థలం, సంబంధిత రికార్డులను ఆర్టీఓ పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ దత్తారెడ్డి, ఆర్‌ఐ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
ఉపాధి కూలీల
ఈ–కేవైసీ పూర్తి చేయాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
చిలప్‌చెడ్(నర్సాపూర్): ఉపాధి కూలీల ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం ఆయన చిలప్‌చెడ్‌లో ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా విధుల్లోకి చేరిన ఎంపీడీఓ బానోత్ ప్రవీణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి, పంచాయతీ కార్యదర్శులకు తగిన సూచనలు ఇస్తూ, కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామా ల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మౌలిక సదుపాయాలపై ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణ అధికారి రంగాచార్యులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని
ప్రారంభించండి
అదనపు కలెక్టర్‌కు రైతుల వినతి
మెదక్ కలెక్టరేట్: తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని, వెల్దుర్తి మండలం పెద్దాపురం గ్రామ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మెదక్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ కేంద్రం ఉండేదన్నారు. గత పంట కాలం నుంచి ఐఓపీ కేంద్రాన్ని పెట్టడం లేదని తెలిపారు. పెద్దాపూర్ గ్రామం నుంచి 5 కిలోమీటర్ల లోపు ఒక్క కేంద్రం కూడా తమకు అందుబాటులో లేదన్నారు. దీంతో గ్రామంలోని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ట్రాక్టర్, టాపర్ల కిరాయిలు కట్టలేక, ధాన్యాన్ని తరలించడంలో ఆలస్యమై ధాన్యం తడిసిపోయి పెట్టుబడి కూడా మిగలడం లేదన్నారు.
కొనుగోళ్లను పరిశీలించిన డీఆర్‌డీఓ పీడీ
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండలం రాజ్‌పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన తూకం, తేమశాతం గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతుల కల్పించి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం నాగరాజు, సీసీ సత్యం, నిర్వాహకులు, వీఓఏ నవనీత ఉన్నారు.
పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టండి: మెదక్ ఆర్డీఓ
పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టండి: మెదక్ ఆర్డీఓ


