బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: ఉద్యోగులు తమ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య సూచించారు. కలెక్టరేట్‌లో కేంద్ర విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో అధికారులు వివిధ శాఖల ఉద్యోగులతో కలిసి వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం పారదర్శకతతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పారదర్శకతతోనే మంచి పాలన అందించగలుగుతామన్నారు. సమగ్రమైన సేవలు అందించడంతో ప్రజల్లో నమ్మకం కలుగుతుందన్నారు.
వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించబోయే మేరా యువభారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 31 నుంచి నవంబర్ 25 వరకు నిర్వహించే పటేల్ జయంతి వేడుకల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా మేరా యువభారత్ అధికారి రంజిత్‌రెడ్డి, జిల్లా యువజన క్రీడాధికారి కాశీంబేగ్, జిల్లా కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్, రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఆర్సీపురం యూనిట్ ఎస్పీ శతకీర్తి, అదనపు కలెక్టర్ మాధురి, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.


