నిజాయితీగా పనిచేయాలి
మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్/కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో అవినీతికి తావులేకుండా పారదర్శక పాలనే లక్ష్యంగా ముందు సాగుతున్నామని, అధికారులు ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడి నిజాయితీగా పనిచేయా లని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జిల్లాలో ‘కల్చర్ ఆఫ్ ఇంటెగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పర్టీ’అనే థీమ్‌తో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుగుతాయన్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశా ల మేరకు స్టేట్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనపై క్విజ్ పోటీలు, వాక్‌థాన్‌లు, మార థాన్ లు, వీధి నాటకాలు, గ్రామసభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విజిలెన్స్ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. తుపాను ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మొంథా తుపాను నేపథ్యంలో రైతులు వరికోతలు వాయిదా వేసుకోవాలన్నారు.


