సిటిజన్ క్లబ్‌లో విస్తృత తనిఖీలు
● పేకాట ఆడుతున్న 50 మందిపై కేసు
● కాయిన్స్, స్కోర్ కార్డులువినియోగిస్తూ డబ్బులు ఎక్చేంజ్
సిద్దిపేటకమాన్: పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... సిద్దిపేటలోని సిటిజన్ క్లబ్‌లో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చింది. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ రవీందర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రవీందర్ ఆధ్వర్యంలో సీఐ వాసుదేవరావు, సిబ్బంది సోమవారం రాత్రి 7నుంచి సుమారు రెండు గంటలకు పైగా సిటిజన్ క్లబ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆరు టేబుళ్ల చుట్టూ 50 మంది డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించారు. మరొక ఐదుగురు వ్యక్తుల వద్ద 20 ప్లాస్టిక్ కాయిన్స్‌ను గుర్తించారు. మిగతా వారిని విచారించగా డబ్బులు పెట్టి ఆడితే పోలీసులు కేసులు పెడతారనే భయంతో క్లబ్‌లో ఆడి ఆ వివరాలు స్కోర్ కార్డులో నమోదు చేస్తారని, బయటకు వెళ్లిన తర్వాత డబ్బులు తీసుకుంటారని పోలీసులు తెలిపారు. దీంతో 50 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, 8 ప్లే కార్డ్ సెట్స్, 6 స్కోర్ కార్డులు, 20 ప్లాస్టిక్ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ రమేశ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిపారు.
క్లబ్‌లో పేకాట ఆడుతున్న దృశ్యం క్లబ్‌లో తనిఖీ చేస్తున్న పోలీసులు
సిటిజన్ క్లబ్‌లో విస్తృత తనిఖీలు


