గురుకుల విద్యార్థులకు సన్మానం
జహీరాబాద్ టౌన్: నీట్ పరీక్షలో ప్రతిభ కనబర్చి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన మైనార్టీ గురుకుల విద్యార్థులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సన్మానించారని ప్రిన్సిపాల్ కేఎస్ జమీల్ తెలిపారు. మండలంలోని అల్గోల్‌లోని బాలుర మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఏడుగురు, బూచినెల్లిలోని బాలికల మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థినులకు ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయన్నారు.హైదరాబాద్‌లో నిర్వహించిన ఉడాన్ 2025 కార్యక్రమంలో భాగంగా మంత్రి విద్యార్థులను సన్మానించి ల్యాప్‌టాప్‌లు అందజేశారని పేర్కొన్నారు.


