పంట వ్యర్థాలు కాల్చితే నష్టం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పంట కోతల తరువాత వ్యర్థాలను కాల్చటం ద్వారా భూసారానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూప అన్నారు. సోమవారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులకు ‘వరి కొయ్యలు కాల్చడం – నష్ట నివారణ చర్యలు’ అనే అంశంపై సలహాలు, సూచనలు అందించారు. పంటలు కోసిన తర్వాత పంట వ్యర్థాలను రైతులు పొలాల్లోనే కాల్చడం వల్ల తీవ్ర వాయు కాలుష్యం, శ్వాసకోశ వ్యాధులకు, భూమిలోని సేంద్రియ కర్బనశాతం తగ్గి భూమి నిస్సారంగా మారడానికి దారితీస్తుందన్నారు. పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నడం వల్ల మేలు చేసే సూక్ష్మజీవులు, బాక్టీరియా, శిలీంధాల్రు బాగా అభివృద్ధి చెందుతాయన్నారు. మంగళవారం ఉదయం 10 నుంచి 11.30గంటల వరకు రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతువేదికల్లో ధాన్యం, మొక్కజొన్న పంట, పత్తి కొనుగోళ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
రైతులతో జిల్లా వ్యవసాయశాఖ
అధికారి స్వరూప


