క్రీడాపోటీల్లో ప్రతిభ చాటాలి
డీఎస్పీ సైదా
జహీరాబాద్: క్రీడాపోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవాలని.. ఇందుకు టోర్నమెంట్లను ఉపయోగించుకోవాలని డీఎస్పీ సైదా అన్నారు. సోమవారం పట్టణంలోని ఎంఆర్‌హెచ్‌ఎస్ ప్రాంగణంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరపోలీసుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పలు పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వాలీబాల్ టోర్నమెంట్‌లో ఆయా ప్రాంతాలకు చెందిన 12 జట్లు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ఎస్‌ఐ వినయ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


