బాబోయ్.. దొంగలు
ఉమ్మడి జిల్లాలో వరుస చోరీలు, దోపీడీలు
● భయాందోళనకు గురవుతున్న ప్రజలు
● పని చేయని సీసీ కెమెరాలు
● నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
ఉమ్మడి జిల్లాలో దొంగలు వరుస దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రోడ్లపై పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లడం, తాళం వేసిన ఇళ్లలో, ట్రాక్టర్ల బ్యాటరీలను ఇలా ఏది దొరికితే అది దోచుకెళ్తున్నారు. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో జరిగిన వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. – సంగారెడ్డి క్రైమ్/ మద్దూరు (హుస్నాబాద్):
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో...
ఇప్పటి వరకు అయిన చోరీలు
ట్రాక్టర్ బ్యాటరీలు 30
ఆలయాల్లో 12
ఇండ్లలో 06
పశువులు 02
మొత్తం 50
సంగారెడ్డిలో దోపీడీలు
గత నెల 11న మధ్యాహ్నం సంగారెడ్డి బైపాస్‌లోని కిరాణ షాపునకు చెందిన నరసింహా రెడ్డి కారులో ఉన్న డబ్బుని అద్దాలు పగులగొట్టి రూ.50వేలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.
ఈనెల 17న కందిలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తికి సంబంధించిన డబ్బును దొంగలు కారు అద్దాలు పగులగొట్టి రూ. లక్షా50 వేలను దోచుకెళ్లారు.
ఈనెల 14వ తేదీన ఉదయం ఓ ఫంక్షన్ హాల్ ఎదురుగా పార్కు చేసిన ఇన్నోవా కారులో ఉన్నా రూ.20 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కారు అద్దాలు పగులగొట్టి ఎత్తుకెళ్లారు.
బాబోయ్.. దొంగలు


