● ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
● గాంధీ ఆస్పత్రికి తరలింపు
మిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని ఎనగుర్తి గ్రామానికి చెందిన బూరు ప్రభాకర్, చిన్న ముత్యాల ప్రసాద్ అక్బర్‌పేట–భూంపల్లి క్రాస్ రోడ్డును దాటుతూ ఎనగుర్తి వైపు వెళ్తుండగా సిద్దిపేట నుంచి మెదక్ వైపు అతి వేగంగా వెళుతున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌తో సహా సుమారు 20 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని పోలీసులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, పరిస్థితి విషమించడంతో సికిద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


