విద్యుదాఘాతంతో పెయింటర్ ..
తూప్రాన్: విద్యుత్ షాక్‌కు గురై పెయింటర్ మృతి చెందాడు. ఈ ఘటన తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన కంచర్ల సతీశ్‌గౌడ్ (38) పెయింట్ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఆదివారం తూప్రాన్ పరిధిలో సెంట్ ఆర్నాల్డ్ స్కూల్ దగ్గరలో ఓ నూతన భవనం వద్ద పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెయింట్ వేస్తున్న సతీశ్‌గౌడ్‌కు పక్కనున్న విద్యుత్ వైర్లు తాకి షాక్‌కు గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.


